అమితాబ్ పాదాభివందనం చేస్తే తల కొట్టేసినట్లయింది -నిర్మాత సి. అశ్వనీదత్

మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, యునానిమాస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో నిర్మాత సి. అశ్వినీదత్ విలేకరుల సమావేశంలో ‘కల్కి 2898 AD’ విశేషాలని పంచుకున్నారు. నిన్న మార్నింగ్ షో నుంచే.. తెలుగు రాష్ట్రాలు, ముంబై, మద్రాస్, బెంగళూరు, ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషనరీ రిపోర్ట్ వచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో అలాంటి అఖండ విజయం వచ్చింది. హ్యాట్సప్ టు నాగ్ అశ్విన్. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. అమితాబ్ నిర్మాతగా గౌరవం ఇస్తూ కాళ్ళకి నమస్కారించినప్పుడు తలకాయ కొట్టేసినంత పనైయిందని అన్నారు మేము కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. అక్కడితో ఆగిపోతాం. అయితే స్టేజ్ మీద మాత్రం ఆయన అలా చేయడం నేను అస్సల్ ఊహించలేదు. అమితాబ్ గారు లెజెండ్. హ్యాట్సప్ టు హిమ్ అన్నారు నిర్మాత అశ్వినీదత్

ఈ శతాబ్దంలోనే మా ఇంట్లోనే ఒక దర్శకుడు

నాగ్ అశ్విన్ మొదటి సినిమా నుంచి తనతో జర్నీ చేస్తున్నాం. తను ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే కాన్ఫిడెన్స్ నాకు మొదటి నుంచి వుంది. అదే మా అమ్మాయిలతో చెప్పాను. తను ఏ సబ్జెక్ట్ చెప్పినా వెంటనే దూకేయమని అన్నాను. ఈ శతాబ్దంలో ఒక దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు
నా మొదటి సినిమా ఎదురులేని మనిషి నుంచి ఇప్పటివరకూ దర్శకుడు చెప్పింది వినడం, తనకు కావల్సినది సమకూర్చడం తప్పా మరో డిస్కర్షన్ పెట్టను. ఇది అందరికీ తెలుసు.’బుజ్జి’ (కారు) ని కూడా ఒక పాత్ర చెయ్యడం పై స్పందిస్తూ
ఇదంతా నాగ్ అశ్విన్ విజన్. ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాలో చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు.

కథ అనుకున్నప్పుడే పార్ట్ 2ఆలోచన

కథ అనుకున్నప్పుడే పార్ట్ 2 ఐడియా ఉందని కమల్ హాసన్ ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. కమల్ గారిది అద్భుతమైన పాత్రని అన్నారు. కల్కి విషయంలో ఎలాంటి టెన్షన్ పడలేదని కాకపోతే మిడ్ సమ్మర్ లో రిలీజ్ అయితే బావుంటుందని అనుకున్నాం. అయితే మే 9 పోస్ట్ పోన్ అయ్యింది. తర్వాత జూన్ 27 కరెక్ట్ అనుకోని ఆ డేట్ కి తీసుకొచ్చాం. నాగీ, స్వప్న, ప్రియాంక ఈ ముగ్గురే కాపీ చూశారు. దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతోనే తీశాం. ఆ ఉద్దేశం నెరవేరింది. పార్ట్ 2 రిలీజ్ నెక్స్ట్ఇయర్ సమ్ వేర్ ఈ టైంలోనే రావచ్చన్నారు.

అందరికి రుణపడి వుంటాను..

వైజయంతి మూవీస్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ని ప్రస్తావిస్తూ ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా మొదటి సినిమా నుంచి, నేటి కల్కి వరకూ అందరికీ రుణపడి వుంటాను. నటీనటులు, టెక్నిషియన్స్ అందరు సొంత మనిషిలా నన్ను దగ్గరకి చేర్చుకొని సినిమాలు చేశారు. అందరికీ హ్యాట్సప్. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో రెండే వస్తాయనీ తర్వాత ఎలా వుంటుందనే స్క్రిప్ట్ బట్టి చూడాలన్నారు

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More