లేటు వయస్సు లో…

ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలన్నది ఓల్డ్ స్కూల్ మాట.. ముచ్చట పడితే ఏ వయస్సు లో తీరితే అదే పెద్ద పండగ అన్నది నేటి మాట.. ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ.. నిరాడంబర జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అరవై ఏళ్ల లేటు వయస్సు లో మరోసారి మనువాడారు.. అస్సామ్ కు చెందిన ముప్పై మూడేళ్ల రూపాలి బారువ అనే యువతి ని కోల్ కతాలో కుటుంబ సభ్యులు,సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్ట్రీమ్యారేజ్ వ చేసుకున్నారు. వివాహం అనంత‌రం ఆశిష్ మాట్లాడుతూ.. నా జీవితంలో ఈ ద‌శ‌లో రూపాలిని వివాహం చేసుకోవ‌డం ఒక అసాధార‌ణ అనుభూతి అంటూ చెప్పుకొచ్చారు.. ‘పద్మావతి హ్యాపీ నా…’అంటూ పోకిరి చిత్రం లో మహేష్ బాబు టీజింగ్ తో ఆదరగొట్టేసిన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆశిష్ విద్యార్థి అటు హిందీ సినిమాల్లో, ఇటు దక్షిణాది సినిమాల్లో నటించి పేరుతెచ్చుకున్నారు ఢిల్లీలో పుట్టిన ఆశిష్ విద్యార్థి తండ్రి మ‌ల‌యాళీ కాగా త‌ల్లి బెంగాలి. 1986 నుంచి సినిమాల్లో త‌న కెరీర్‌ను ప్రారంభించిన‌ ఆశిష్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, బెంగాలీ ఇలా దాదాపు 11 భాష‌ల్లో 300 చిత్రాల్లో న‌టించారు. ‘పాపే నా ప్రాణం’ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యారు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి ప్రేక్ష‌కుల మ‌నసులో చోటు సంపాదించుకున్నారు. ‘పోకిరి’, ‘గుడుంబా శంక‌ర్’ చిత్రాలు ఈయ‌న‌కు మంచి పేరును తీసుకువ‌చ్చాయి. ‘కాల్ సంధ్య’సినిమాతో చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆశిష్ ‘ద్రోహ్ కాల్’ సినిమాతో ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్న ఆశిష్ విద్యార్థి ఇటీవల వివిధ ప్రాంతాలను పర్యటించి యూ ట్యూబ్ వీడియో లతోను రీల్స్ తోను నెటిజన్లకు(ప్రేక్షకులకు) దగ్గరయ్యారు.. ప్రముఖ థియేటర్ ఆర్టిస్, సింగర్. ఆమె నాటి బెంగాలి నటి శకుంతల బారువా కుమార్తె, నటీ, రాజోషీ వివాహం చేసుకున్న ఆశిష్ ఆమెతో విభేదాల కారణంగా విడిపోయారు.వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు తనకన్నా సగం వయసున్న రూపాలి ని పెళ్ళి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. అస్సాంలోని గువాహతికి చెందిన ఈమెకు కోల్‌కతాలో ఫ్యాషన్ స్టోర్‌లు ఉన్న రూపాలి ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తున్నారు.

Related posts

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి

గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More