వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన మైత్రి మూవీస్ అమిగోస్ చిత్రం లోని అప్ డేట్స్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. కన్నడలో సక్సెస్ ఫుల్ కదానాయక గా గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్.. ఈ చిత్రం తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తోన్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఇందులో ‘ఇషిక’ పాత్రలో నటిస్తోందని ఆమె క్యారెక్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఆడియెన్స్‌ని తన లుక్స్ తో కట్టిపడేసాల ఉన్న ఆషికా రంగనాధ్ ఈ చిత్రం తో తెలుగు పాగా వేయడం ఖాయమంటున్నారు మేకర్స్. అయితే కళ్యాణ్ రామ్ ని మూడు లూక్కుల్లో చూపిస్తూ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం అని కూడా ఇప్పటికే ప్రకటించారు అయితే ఇందులో ఆషికా ఒక్కరే హీరోయినా ఇంకా వేరే ఉన్నారా అన్నది మేకర్స్ రివీల్ చెయ్యాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.