సెప్టెంబ‌ర్ 28న‌ ‘గేమ్ ఛేంజ‌ర్ నుంచి మరో పాట

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా.2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
గేమ్ ఛేంజ‌ర్‌’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌, ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబ‌ర్ 28న సెకండ్ సింగిల్ రాబోతున్నట్టు ఎనౌన్స్ చేస్తూ ప్రోమో విడుద చేసారు..

ప‌ల్ల‌విలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ నుంచి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీ నుంచి ప‌క్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు.

ఇప్ప‌టికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ స‌రికొత్త ఎన‌ర్జీనిచ్చింది. విన‌య విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంది గేమ్ ఛేంజ‌ర్ యూనిట్ లో.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More