గతం లో శాసనసభ చిత్రంతో ముందుకొచ్చిన సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా షణ్ముగం సాప్పని దర్శకత్వం లో సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మించిన డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసి రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.అన్ని భాషల్లో ఒకేసారి అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆది సాయికుమార్, అవికాగోర్ ఉత్కంఠగా నడిచివస్తున్న ఈ పోస్టర్‌లో అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ ‘ఇదొక డివోషనల్ థ్రిల్లర్. ప్రతి సన్నివేశంలోనూ ఓ పాజిటివ్ వైబ్, మ్యాజిక్ వుంటుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో మెస్మరైజ్ చేసే విధంగా వుంటుంది డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుంటుంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలుకానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు.