‘ఆయ్’ టైటిల్ అరవింద్ గారి ఆలోచనే -నార్నే నితిన్‌

సినిమాకు ముందుగా ‘ఆయ్’ అనే టైటిల్‌ను అనుకోలేదు. అర‌వింద్‌గారి ఆలోచనతోన ఈ టైటిల్ పెట్టాం. అందుకు కార‌ణం.. గోదావ‌రి స్లాంగ్‌లో ఆయ్ అనే ప‌దాన్ని కామ‌న్‌గా వాడుతుంటాం. అలాగే సినిమాలోని ప‌లు సంద‌ర్భాల్లో ఈ ప‌దాన్ని వాడ‌టాన్ని బ‌ట్టే ‘ఆయ్’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేశామని ఆ చిత్ర కథానాయకుడు నార్నె నితిన్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అంజి కె.మణిపుత్ర దర్శకత్వం లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఆయ్ ఆగస్ట్ 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో నార్నే నితిన్ మీడియాతో ‘ఆయ్’ సినిమా విశేషాల‌ను తెలియ‌జేశారు.. సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. కాబ‌ట్టి పోస్ట‌ర్స్‌లో అంతా ఫ‌న్ బాత్ అనే పెట్టాం. ఇది డైరెక్ట‌ర్‌గారి ఆలోచ‌న‌. సినిమా విడుద‌లైన రోజున ఆ విష‌యం స్ప‌ష్టంగా అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. ఆగ‌స్ట్ 15న చాలా సినిమాలు రిలీజ్‌లున్నాయి. అయితే మాకుండాల్సిన ఆడియెన్స్ మాకున్నార‌ని అనుకుంటున్నాం. మంచి ఫ‌న్ ఉన్న గోదావ‌రి బ్యాక్ డ్రాప్ మూవీ వ‌చ్చి చాలా కాల‌మైంది. క‌చ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం.
చిన్న‌ప్ప‌టి నుంచి నాకున్న గోదావ‌రి ఫ్రెండ్స్‌తో మాట్లాడ‌టం, వాళ్లు మాట్లాడేట‌ప్పుడు విన‌టం చేశాను. కాబ‌ట్టి ‘ఆయ్’ మూవీలో స్లాంగ్ మాట్లాడేట‌ప్ప‌డు నాకేమీ ఇబ్బందిగా అనిపించ‌లేదు. మ్యాడ్ మూవీ క‌థ‌కు త‌గ్గ‌ట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’ సినిమా క‌థ‌కు త‌గ్గ‌ట్టు యాక్ట్ చేశాను. ఈ మూవీ కోసం స్పెష‌ల్ గా క‌ష్ట‌ప‌డ‌లేదు. డైరెక్ట‌ర్‌గారు చెప్పిన‌ట్లు ఫాలో అయ్యానంతే. ఎన్టీఆర్‌గారు ట్రైల‌ర్ చూశారు. ఆయ‌న‌కు కామెడీ బాగా న‌చ్చింది. ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన త‌ర్వాత కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి అలాంటి రెస్పాన్స్ వ‌స్తే బావుంటుంద‌నిపిస్తుంది.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More