చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా వుందని హీరొ రానా దగ్గుబాటి అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలు గా నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన “35-చిన్న కథ కాదు’. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం థాంక్స్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్ గా వుంది. సురేష్ ప్రొడక్షన్ పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. మీడియా కి థాంక్ యూ. ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్టార్స్ నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే వుంటాం’ అన్నారు హీరోయిన్ నివేద థామస్ మాట్లాడుతూ.. అన్నిచోట్ల సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతోంది. నిన్న ఓ సింగిల్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయి, చాలా మంది పిల్లలు స్టేజ్ వద్ద ఆడుకోవడం చూసినప్పుడు ఒక నర్సరీ స్కూల్ లో సినిమా ప్లే చేసిన గొప్ప అనుభూతిని ఇచ్చింది. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్. ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైందన్నారు..
హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి ’35-చిన్న కథ కాదు’ తో ప్రూవ్ అయ్యింది. థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా వుంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా వుందన్నారు.
డైరెక్టర్ నంద కిషోర్ ఈమాని , నిర్మాతలు సిద్ధార్థ్ రాళ్లపల్లి , సృజన్ యరబోలు తదితరులు మాట్లాడారు..