హిందీ తరువాత అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న తెలుగు సినిమా 2022 ఫస్ట్ ఫేజ్ లో అంటే జనవరి నుంచి జూన్ మాసాంతానికి డబ్బింగ్ చిత్రాలతో కలిపి 100 చిత్రాలను విడుదల చేసి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో చిత్రాల విడుదల ఈ స్థాయి లో నమోదు కావడం కాస్తంత ఆశ్చర్యానికి గురి చేసే అంశమే.ఓటీటీ లో డైరెక్ట్ విడుదలైన చిత్రాలతో కలుపుకుంటే చిత్రాల విడుదల భారీ గానే ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.. ఎప్పుడూ రాశి కన్నా వాశి లో ముందుండే తెలుగు సినిమా మరోసారి తన ఉనికి నిలుపుకున్నట్టయింది. ధియేటర్ లో విడుదల అయితే గాని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినిమా లను తీసుకోమని చెప్పాడం తో గత్యంతరం లేని స్థితిలో సినిమాలను విడుదల చెయ్యాల్సి వచ్చిందని అయితే కలెక్షన్ల పరం గా విడుదలకు పెట్టిన పెట్టుబడిలో పదిశాతం కూడా రాలేదని ఓ చిన్న సినిమా నిర్మాత చెప్పడం పరిస్థితి కి అద్దం పడుతోంది. జనవరి ఫస్ట్ ఆశా ఎన్కౌంటర్, ఇందువదన చిత్రాల విడుదలలో మొదలైన పరంపర జూన్ 24న విడుదలైన 8 చిత్రాలతో సంవత్సరం ఫస్ట్ హాఫ్ ముగిసింది. జనవరి లో 15, ఫిబ్రవరి లో 22, మార్చి లో 12, ఏప్రిల్ లో 16, మే లో 15, జూన్ లో 21 చిత్రాలు విడుదల కు నోచుకున్నాయి. ఇందులో రెండు స్ట్రెయిట్ చిత్రాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు సుపర్ హిట్ కాగా మరో రెండు చిత్రాలు హిట్ ని అందుకున్నాయి ఎవరేజ్ ఖాతాలో ఓ ఆరు చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. మొదటి రోజే హిట్ టాక్ వచ్చిన అంటే.. సుందరానికి సినిమా విచిత్రమైన పరిస్థితి ని ఎదుర్కొని నిడివి ఎక్కువ అన్న సాకు తో చివరికి ప్లాప్ ముద్ర వేయించుకోవడం కొసమెరుపు. హిట్ టాక్ వచ్చిన సర్కారు వారిపాట, ఎవేరేజ్ అనిపించుకున్న ఎఫ్3 బ్రేక్ఈవెన్ కూడా దాటక పోవడం విశేషం. మరి సెకండ్ ఆఫ్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.