తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ వేదికలు కాలుకదపని వినోదాన్ని అందిస్తున్నాయి.. ఒకప్పుడు ఎప్పుడో మూడునాలుగు నెలలకు టీవీ లో చూసే కొత్త సినిమాలు నెలకే చూసేసే అవకాశం ఇచ్చిన ఫ్లాట్ ఫామ్స్ ఇంకాస్త ముందస్తు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు పోటీలు పడుతున్నాయి జూన్ 17 న విడుదలైన విరాటపర్వం చిత్రం మరీ ఎర్లీ గా అంటే రెండు వారాలకే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కాబోతుంది. నిజానికి ఈ సినిమాని ముందుగా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా విడుదల చేద్దామనుకున్నారు. దాదాపు 30 కోట్ల డీల్ వచ్చింది. కానీ,అంత కన్నా ఇది ఎక్కువ వసూళ్లు అందుకుంటుంది అని భావించారు.అలా, థియేటర్లలో విడుదలైంది. ఓ వైపు ఓటీటీ ల వలనే ప్రజలు ధియేటర్ లకు దూరం అవున్నారని సినిమా థియేటర్లు బతకాలంటే కనీసవ్యవధి పాటించాలన్న చర్చ నిర్మాతల మధ్య జరుగుతున్న నేపథ్యంలోనే రానా దగ్గుబాటి, సాయిపల్లవి నటించిన విరాటపర్వం మరీ రెండు వారాలకే డిజిటల్ తెరకు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ చిత్రం విమర్శకులనించి ప్రశంశలు అందుకున్న కాసులు మాత్రం కురిపించలేకపోయింది.. కరొనా కష్టాలన్నింటిని దాటుకుని ఎట్టకేలకు 14కోట్ల బ్రేక్ ఈవెన్ కోసం బరిలోకి దిగి చతికిలబడింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ రియల్ స్టోరీ కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోయినా మేధావివర్గం మంచి రిపోర్ట్ ని సపోర్ట్ ని అందించినా బ్రేక్ ఈవెన్ గీత ని టచ్ చేయలేకపోయింది.. ఇంకా ఆలస్యం చేస్తే మరింత కష్టం అనుకున్నారేమో వచ్చిన బెస్ట్ ఆఫర్ కు ఒకే చెప్పేసి.. విడుదలకు సై అనేసారని ఫిల్మ్ నగర్ టాక్.. చెరుకూరి సుధాకర్ తో కలసి సురేష్ బాబు నిర్మించిన విరాటపర్వం ఓటీటీ లో ఎన్ని మిలియన్ అవర్స్ వ్యూస్ సాధిస్తుందో చూడాలి