ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుంది బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ వివాదం.ఇప్పటికే చాలా మంది మేకర్స్ అన్నిరకాలుగా ఫ్రీమేక్ చేసేసిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అవుతుందని అనుకుంటున్న నేపథ్యంలో బ్యాన్ లాల్ సింగ్ చెడ్డా యాష్ టాగ్ సినిమా పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అంతవరకు ఒకే అనుకున్నా ఆ వివాదం కాస్తా మెగాస్టార్ చిరంజీవి మెడకి చుట్టుకోవడం మరింత చర్చానీయాంశం అయింది.. హిందూ వ్యతిరేకిగా , భారత్ దేశం పట్ల అసహనం ప్రదర్శిస్తున్న వ్యక్తిగా అమీర్ ఖాన్ ని భావిస్తూ కొంతమంది అతివాదులు చేస్తున్న ప్రచారం నెట్టింట ట్రెండ్ అవుతుంది. గతం లో అమీర్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ తవ్వి తీసి ట్రెండింగ్ లోకి తీసుకురావడమే కాకుండా లాల్ సింగ్ చెడ్డా తెలుగు వెర్షన్ కి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిరంజీవి ని టార్గెట్ చేసుకునేంతవరకు వెళ్ళింది. బ్యాన్ అమీర్ ఖాన్, బ్యాన్ లాల్ సింగ్ చెడ్డా తో పాటు బ్యాన్ గాడ్ ఫాదర్ ని విపరీతంగా త్రో చేస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయా కామ్ 18 స్టూడియోస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కు వారం సమయం ఉన్న తరుణం లో ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ షాక్ ఇస్తున్నాయి ఆమీర్‌ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. అభిమానులు ఆయన సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారని అనుకుంటే పూర్ బుకింగ్స్ ఆశ్చర్య పరుస్తున్నాయి. తెగ ప్రమోట్ చేస్తున్న తెలుగు వెర్షన్ కు కూడా అదే పరిస్దితి ఎదురవ్వడం మాట అటుంచితే ప్రెజెంట్ చేసిన పాపానికి చిరంజీవి కి మకిలి అంటించే ప్రక్రియ స్పీడందుకుంది. అమీర్ ఖాన్ వ్యతిరేక వర్గం తో పాటు మెగా కాంపౌండ్ వ్యతిరేకవర్గం కూడా గాడ్ ఫాదర్ ని టార్గెట్ చేసినట్టు కనపడుతోంది. స్లోగా బుకింగ్స్ ప్రారంభమయ్యినా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే నిలబడుతుందని భావిస్తున్నారు..