ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాతో కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రాలను స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కెమెరా తీసిన ఫొటోలను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ డిజిటల్ కెమెరా 3,200 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగి ఉందన్నారు. రాత్రి వేళల్లో ఖగోళ చిత్రాలను కచ్చితత్వంతో చిత్రీకరించడం కోసం దీన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా దీనిని రూపొందించడం జరిగిందని చెప్పారు. ఈ కెమెరా లెన్స్ ఐదున్నర అడుగుల అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుందన్నారు. ఈ లెన్స్ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదని తెలిపారు. ఈ కెమెరాను వచ్చే ఏడాది చిలీలోని ఓ పర్వతంపై కూర్చొ బెడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పా రు. ఆకాశంలో రాత్రి వేళల్లో జరిగే అద్భుతాలు, రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాధారణంగా మనం దిగే ఫొటోలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో ఈ కెమెరా ఫొటోలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. కెమెరా ముందుభాగంలో ఉండే అద్దం 27 అడుగులు ఉంటుందనిఅంటే టెన్నిస్ సింగిల్స్ కోర్టు సైజులో ఉంటుందని చెప్పారు. ఇది 189 సెన్సర్లు కలిగి ఉంటుందని,2800 కిలోల బరువు ఉంటుందని వెల్లడించారు.