ఓవైపు 2024 ఎన్నికలకు యుద్ధ ప్రాతిపధికన సిద్ధమవుతున్న జనసేనాని మరోవైపు వరస సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై సంబరాలు సృష్టించడానికి రంగం రెడీ చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలను ఢీకొట్టే లోగానే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియన్స్ కి వరుస కిక్ ఇవ్వబోతున్నాడు అప్పుడెప్పుడో హరిశంకర్ తో కమిటైన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ఎట్టకేలకు సెట్ కు వచ్చేందుకు సిద్ధమైంది అయితే భవదీయుడు కాస్త ఉస్తాద్ గా మారి ‘థిస్ టైం ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ‘ అన్న డిస్క్లైమెర్ ఇస్తూనే మనల్ని ఎవడ్రా ఆపేది అన్న వస్తున్నాడు ఇన్నాళ్టి సినిమా ఉంటుందా ఉండదా అన్న టాగ్ ని ఇచ్చారు.. ఇన్నాళ్లు ఈ సినీమా ఉంటుందా..? ఉండదా..? అన్న డౌట్ తో ఉన్న పవన్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా తీపి కబురైనప్పటికీ దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం తెరీ (తెలుగులో పోలీసోడు)కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రూపుదిద్దుకొని ఉందని వస్తున్న వార్తలు మాత్రం వీళ్ళకి మింగుడు పడటం లేదు ఇప్పటికే రీమేక్ చేయొద్దు అన్న అభిమానుల వ్యతిరేకత కూడా తీవ్ర స్థాయికి చేరింది సూసైడ్ నోట్స్ రాయడమే కాకుండా రీమేక్ వద్దన్న ట్వీట్స్ దాదాపు రెండు లక్షల దాటిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా అయాంక బోస్ ఛాయాగ్రాహకుడు. చాలాకాలం తర్వాత పవన్ పాత మిత్రుడు ఆనంద్ సాయి చిత్రానికి వర్క్ చేయనుండడం విశేషం. ఇక పవన్ రాజకీయరథం వారాహి రంగు పై అధికార వైసిపి నేతలు కామెంట్ చేస్తుండడం.. వాటికి పవన్ కళ్యాణ్ గట్టిగా కౌంటర్ ఇవ్వడం నేపథ్యంలో వార్తల్లోని మిలటరీ గ్రీన్ కలర్ షర్ట్ ధరించి ముహూర్తం పూజకు జనసేనాని హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.