కల్యాణ్ రామ్ కెరీర్ లొనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం బింబిసార. కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన ఈ సోషియో ఫాంటసీచిత్ర నిర్మాణానికి కల్యాణ్ రామ్ భారీగానే ఖర్చు పెట్టారు. సినిమా హిట్టయితే…2,3,4 సీక్వెల్స్ కూడా తీస్తానని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న ‘బింబిసార’ ఒక్కసారి గా బజ్ ని అందుకుంది. ట్రైలర్ బయటకు వచ్చిన తరువాత సినిమా ప్లస్ మైనస్ లు మాట్లాడుకోవడం మొదలెట్టేశారు. అయితే ఈ బింబిసారుడు అల్లు వారి కాంపౌండ్ నుండే వచ్చిన కథ అని గుసగుసలు రన్ అవుతున్నాయి. లిరిక్ రైటర్ కులశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమలేఖ రాసా… సినిమా లో హీరో గా నటించిన వేణు మల్లిడి. వశిష్ట మల్లిడి గా పేరు మార్చుకుని దర్శకుడి గా తీస్తున్న చిత్రమే బింబిసార. అయితే ఆరు సంవత్సరాల క్రితమే శైలేంద్ర ప్రొడక్షన్ బేనర్ పై అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా మొదలైంది. దీనికి తుగ్లక్ అన్న టైటిల్ ని కూడా అనుకున్నారు. ఈ సినిమాకు అల్లు అర్జున్ తో బన్నీ సినిమా తీసిన నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు,అల్లు శిరీష్ క్లాస్మెట్ అయిన ఎమ్ వీ ఎన్ రెడ్డి అలియాస్ వేణు మల్లిడి అలియాస్ వశిష్ట మల్లీడి దర్శకుడు. లవ్ ఎంటర్టైనర్ గా కొనసాగే కధ లో ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన హిస్టారికల్ స్టోరీ తో నడుస్తుందని దర్శకుడు అప్పుడే చెప్పాడు. అదే ప్రెస్మీట్ లో మాట్లాడిన శిరీష్ వేణు చెప్పిన పాయింట్ నచ్చి పెద్ద హీరో అయితే ఈ కధ కు బావుంటుంది అని కొంతమంది హీరో లకు సజెస్ట్ చేసినట్టు చెప్పుకొస్తూనే మనమోకటి అనుకుంటే దేవుడు వేరే తలస్తాడు.. ఎవరికో అనుకుంటే ఈ కథ నాకు రాసిపెట్టుంది అని చెప్పుకొచ్చాడు. అల్లు శిరీష్ అన్న మాటే కొద్దిగా నిజమైనట్టేయింది. ఓపెనింగ్ చేసుకున్న శిరీష్ నాలుగవ సినిమా అలా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే కథ (కొద్దిగా అటుఇటుగా) నందమూరి క్యాంప్ కొచ్చిందని సమాచారం. బింబిసార సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ14 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. కల్యాణ్ రామ్ సినిమాకి రూ.14 కోట్ల బిజినెస్ ఎక్కువేఅయిన… బింబిసార భారీ బడ్జెట్ కావడం వలన శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచి మిగిలింది రాబట్టు కోవాలి. ఆగస్టు 5 న ఈ సినిమా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలతోనే వున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా సరే, పార్ట్ 2 ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలన్న పట్టుదల తో కల్యాణ్ రామ్ ఉన్నాడట. సినిమా మిస్ అయినందుకు అల్లు వారబ్బాయి ఫీల్ అవుతాడా..? చెయ్యలేక పోయినందుకు ఆనంద పడతాడా..? అన్నది ఆగస్ట్5 నే తెలుస్తుంది.