సరిగ్గా 40 సంవత్సరాలు తర్వాత పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరావు నటించిన ‘ప్రతిభింభాలు’ చిత్రం నవంబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది 1982లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇన్నాళ్లకు థియేటర్లను పలకరించనుంది. సినిమారంగంలో చాలా సినిమాలు ఎదుర్కొంటున్న విడుదల కష్టాలను అధిగమించడం లో వెనుకబడిపోయిన ప్రతిభింభాలు ఇప్పటికి ఆర్థిక ఇబ్బందులను, న్యాయపరమైన చిక్కులను క్లియర్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం గా రూపొందిన ఈ చిత్రాన్ని విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పై జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాష్ రావు దర్శకత్వం వహించారు కే ఎస్ ప్రకాష్రావు చిత్రం పూర్తికాకుండా కన్నుమూయడంతో సింగీతం శ్రీనివాసరావు దాన్ని పూర్తి చేశారు అక్కినేని సరసన ఇప్పుడు తల్లి పాత్రధారులు జయసుధ తులసి కథానాయకలుగా నటించగా కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వర ఇతర పాత్రలను పోషించారు ఇప్పటి సాంకేతికతతో కొత్త హంగులు అద్దుకుని ఈ చిత్రం నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సెప్టంబరులో 20 వ తేదీన అక్కినేని జయంతి ని పురస్కరించుకుని చిత్రం విడుదల చేయాలనుకున్నా సాధ్యపడలేదు.. ఇప్పుడు విడుదల అవుతున్న ఈ చిత్రం అక్కినేని అభిమానులకే కాదు సినిమా అభిమానులకు కూడా ఒక గొప్ప అనుభూతే..