ఏ ముహూర్తాన కలుస్తారో కానీ ఆ కాంబినేషన్ అలా నిలిచిపోతుంది.. హీరో హీరోయిన్ లు, దర్శకులు సంగీత దర్శకద్వయం, దర్శకనిర్మాతలు, దర్శక హీరోలు, ఇలా ఈ బంధం ధృడ మైనది అని ముందుకెళ్లే జంటలు, మనకి సినిమా ప్రపంచం లో చాలా హిట్ కాంభోలు కనిపిస్తాయి.. ఆ కాంబినేషన్ ల్లో పూరి, విజయ్ దేవరకొండ దాదాపుగా చేరిపోయారు. ఒక్క హిట్ కూడా ఇంకా కొట్టకుండానే వరుస కాంబో లకు ప్లాన్స్ వేసేస్తున్నారు. అది కూడా అన్ని పాన్ ఇండియలే.. లైగర్ విడుదల కు ముందే జనగణమన ను మొదలు పెట్టిన ఈ జంట జనగణమన విడుదల కు ముందే మరోసినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యారట అదికూడా ఇంతవరకు వీళ్ళిద్దరూ టచ్ చెయ్యని సోషియో ఫాంటసీ చిత్రం . పాన్ ఇండియా స్కేల్ లో విజువల్ వండర్ గా దీన్ని డిజైన్ చెయ్యాలని స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. లైగర్, జనగణమన చిత్రాల షూటింగ్ టైం లొనే విజయ్ కు స్టోరీ లైన్ వినిపించి కన్ఫార్మ్ చేసేసుకున్నారట డైరెక్టర్ పూరి. హీరోలతో ఎక్కువ ప్రేమ గా వుండే పూరి తో బాలయ్య బాబు ఇలాగే వరుస సినిమాలు చేస్తాడని అప్పట్లో పెద్ద టాక్ నడిచినా ఆ కాంబో కి ఎందుకో బ్రేక్ పడింది. పూరి విజయ్ కలయిక మాత్రం వర్కవుట్ అయినట్టే కనిపిస్తుంది. మంచి క్వాలిటీ తో తక్కువ రోజుల్లో సినిమా మేకింగ్ చేసే దర్శకుడిగా పేరున్న పూరి ఎంచుకున్న సోషియో ఫాంటసీ చిత్రం పై ఎక్సపెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉంటాయి..