మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి చిత్రం ఈ సంవత్సరాంతానికి సందడి చేయనుంది.. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ పేరు నే ఈ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ కి వాడుకున్నారు..విజయ్ డ్రెస్ కి సమంతా చీర ముడివేసినట్లు ఉన్న లుక్ ఫాన్స్ కి బాగా నచ్చేసింది.. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అన్న హింట్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు… రవిశంకర్ , నవీన్ యెర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ సూపర్ హిట్ హృదయం ఫేమ్ హాషిం అబ్దుల్ వహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు… తెలుగు తో పాటు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేశారు.. పూరిజగన్నాద్ దర్శకత్వంలో లైగర్ విడుదలకు సిద్ధం అవుతుండగా.. వెంటనే అదే కాంబినేషన్ లో జనగణమన చేసేందుకు కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే… బ్యాక్ టూ బాక్ ఫిలిమ్స్ తో దేవరకొండ అభిమానులకు ఇక నాన్ స్టాప్ పండగే…