విజయ్ దేవరకొండ లైగర్ బిగ్గెస్ట్ ప్లాప్ తరువాత ప్రేక్షకులను పలకరించాల్సిన ఖుషి సినిమా ఇంకాస్త ఆలస్యం కానుందని వినికిడి. చాలా రోజుల క్రితమే డిసెంబర్23 న విడుదల అని నిర్మాణ సంస్థ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే షూటింగ్ లో అనుకోని అవంతరం ఏర్పడటం వలన ఈ ఏడాదికి విజయ్ సినిమా రిలీజ్ లేనట్టే అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కొన్ని ఆరోగ్య కారణాలతో హీరోయిన్ సమంత షూటింగ్ విరామం తీసుకోవడం మళ్ళీ సెట్లో ఎప్పుడు జాయిన్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో అప్డేట్ విషయంలో ఇప్పుడు మేకర్స్ సైలెంట్ అయిపోయారు. ప్రీవియస్ హిట్, ఫట్ లతో సంబంధం లేకుండా నమ్మితే సినిమా చేసేసే విజయ్ శివ నిర్వాణ కి కూడా అలాగే అవకాశం ఇచ్చాడని టాక్. దర్శకుడి గత చిత్రం ‘టక్ జగదీష్’ కి ఓటీటీ లో మంచి వ్యూసే దక్కినప్పటికీ సినిమా మాత్రం ప్లాప్ ముద్రను తప్పించుకోలేకపోయింది.. ఒక ప్లాప్ తగిలితే మొహం చాటేసే రోజుల్లో నిర్మాతలు గాని, హీరో విజయ్ గాని ఈ సినిమాకు దాదాపు తొంభై కోట్లు పెట్టడం సాహసమే.. ఒక ప్రేమ కథకి మైత్రి మూవీస్ ఇంత భారీగా ఖర్చుపెట్టడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.