ఐ ఎమ్ డీ బి రేటింగ్ టాప్ లో ద కశ్మీర్ ఫైల్స్

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన టాప్ 10 సినిమాలు వెబ్ సిరీస్‌ల‌ రేటింగ్ లను ఐఎండీబీ విడుద‌ల చేసింది. మూవీస్‌లో ‘ద క‌శ్మీర్ ఫైల్స్‌’, వెబ్ సిరీస్‌ల‌లో ‘కాంప‌స్ డైరీస్’ టాప్‌లో నిలిచాయి. భారతదేశంలోని ఐ ఎమ్ డీ బి పేజ్ లైక్స్, ఆధారంగా ఈ రేటింగ్స్ ని రూపొందించారు. సినిమాలు, టీవీ షోలు, సెల‌బ్రిటీల స‌మాచారం విష‌యంలో అత్యంత పాపుల‌ర్ వేదిక అయిన ఐఎండీబీ, మనదేశంలోని ప్రేక్షకుల ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివరాల్ని వెల్ల‌డించింది. బాక్సాఫీస్ దగ్గర సాధించిన వసూళ్లు , సినీ విమర్శుల నుండి వచ్చే రివ్యూలను బేస్ చేసుకోకుండా దేశంలోని ఐ ఎమ్ ఢీ బి వినియోగదారుల పేజ్ వ్యూస్‌ను లెక్కించే ఐ ఎమ్ డీ బి ప్రో డేటా ఆధారంగా ఈ లిస్టును రూపిందించినట్లు తెలిపింది. మోస్ట్ పాపుల‌ర్ ఇండియ‌న్ మూవీస్‌లో ‘ద క‌శ్మీర్ ఫైల్స్’ మొదటి స్థానం లో నిలవగాటాప్ , దాని త‌ర్వాత స్థానాల్లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2, ఆర్ఆర్ఆర్‌, గంగూబాయ్ క‌థియ‌వాడి, విక్ర‌మ్ నిలిచాయి. 2022 ప్రథమార్థంలో ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన భార‌తీయ చిత్రాలు ద క‌శ్మీర్ ఫైల్స్‌, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2, ఆర్ఆర్ఆర్‌, గంగూబాయ్ క‌థియ‌వాడి, విక్ర‌మ్, ఝుండ్‌, స‌మ్రాట్ పృథ్వీరాజ్‌, ర‌న్‌వే 34, ఎ థ‌ర్స్‌డే, హృద‌య‌మ్‌. థియేట‌ర్ల‌లో విడుదలైన చిత్రాలు ఉండగా , డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ లో నుంచి జూలై 5 వ‌ర‌కు విడుద‌లైన సినిమాల్లో ఐఎండీబీ వినియోగ‌దారులు ఇచ్చిన 7 అంత‌కంటే ఎక్కువ రేటింగ్ సినిమాల్లో ఈ ప‌ది సినిమాలు ఇండియాలో ఎక్కువ ఐఎండీబీ పేజ్ వ్యూస్‌ను సాధించాయి. ఇక అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల విష‌యానికొస్తే, ‘క్యాంపస్ డైరీస్’ (ఎంఎక్స్ ప్లేయ‌ర్‌) అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా, దాని త‌ర్వాత స్థానాలను ద గ్రేట్ ఇండియ‌న్ మ‌ర్డ‌ర్ (డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌), రాకెట్ బాయ్స్ (సోనీ లివ్‌), పంచాయత్ (ప్రైమ్ వీడియో), హ్యూమ‌న్ (డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌) యే కాలీ కాలీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్‌), అప‌హ‌ర‌ణ్ (వూట్ అండ్ ఆల్ట్‌బాలాజీ), ఎస్కేప్ లైవ్ (డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌), మాయి (నెట్‌ఫ్లిక్స్‌), ద ఫేమ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్‌).లకు చోటు లభించింది.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More