ఆర్ధిక రాజధాని లో శ్రీనివాసుడు

ఆర్ధిక రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్‌ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు  మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్యా ఠాక్రే..  శ్రీవారి ఆలయం నిర్మాణం నిమిత్తం కేటాయించిన భూమి పత్రాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.నవీ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ భూమి విలువ దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.   ముంబైలోని అత్యంత విలువైన భూమిని ఆలయ నిర్మాణం కోసం కేటాయించడం పట్ల శ్రీవారి భక్తులు  హర్షం వ్యక్తం చేస్తూ  మహారాష్ట్ర ప్రభుత్వానికి  కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయం నిర్మాణం వ్యయాన్ని  భరించేందుకు  రేమాండ్ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌ సింఘానియా ముందుకు వచ్చారు..

Related posts

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More