సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిని నటుడు పృథ్వీరాజ్ తన నోటీ దురుసుతో అందరికీ దూరం అయ్యాడు. అటు రాజకీయాలలో ఇటు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దవాళ్లతో సన్నిహిత సంబంధాలు కలిగిన పృధ్వి రాజు నోటికి వచ్చినట్లు మాట్లాడిన తీరుతోనే వారికి దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని విధాలుగా తనకు జరిగిన నష్టానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. రాజకీయం – సినిమా అనే రెండు పడవలపై వెళ్లడంతోనే తనకి పరిస్థితులు వచ్చినట్లు తెలుస్తోంది. తనకంటే ముందు సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, మురళి మోహన్, జయప్రద వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ఆయా పదవులలో కొనసాగిన సరే ఎప్పుడు కూడా తమ హద్దులు దాటి ప్రవర్తించకుండా, నోటిని అదుపులో పెట్టుకుని అందరితో సఖ్యతగా మెలగడం వలన వాళ్ళు అజాతశత్రువులు గా కొనియాడ బడుతున్నారు. ఒక రాజకీయ పార్టీలో ఉంటూ కీలక పదవిలో కొనసాగుతూ పలువురు రాజకీయ నేతలపై అలాగే సినిమా వాళ్లపై అహంకార పూరితంగా తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేశాయని నటుడు పృథ్వీరాజ్ చెబుతున్నారు. తన నోటి దురుసు తో జరిగిన నష్టాన్ని ఇప్పుడుకిప్పుడు పూడ్చుకోలేనని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. తాజాగా ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న సమస్యలను, తనకు జరిగిన నష్టాన్ని చెబుతూ దాని అంతటికి కారణం అహంకారంతో తాను చేసిన వ్యాఖ్యలేనని స్పష్టం చేశారు. తన మాటల వల్ల చాలామంది బాధపడ్డారని, తన కు ఎంతో ఆత్మీయులైన పలువురు రాజకీయ నాయకులను, సినిమా ప్రముఖులను దూరం చేసుకున్నానని వాపోయారు. ఈ ఇంటర్వ్యూ సుముఖంగా తన వల్ల బాధపడ్డ వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జరిగిన అనుమానం, కరోనా కారణంగా తాను పడిన బాధ ఇప్పటికీ తనకు గుర్తు ఉన్నాయని అన్నారు. తల బిరుసు వ్యాఖ్యల కారణంగానే సినిమా అవకాశాలు లేకుండా పోయావని చెప్పారు. ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాని, ఇప్పటి నుంచి కొత్త పృథ్వి రాజ్ ను చూస్తారని అన్నారు. ఇక ఎప్పటికీ తాను వివాదాస్పద వ్యాఖ్యలకు పొదల్చుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మందిని స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పడం జరిగిందన్నారు. తనలో వచ్చిన మార్పునకు ఫలితం కూడా కనిపిస్తుందన్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూన్నట్లు చెప్పారు. తమిళ్ లో స్టార్ హీరోలు విజయ్, రజనీకాంత్ సినిమాలలో అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఇక తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాను భవిష్యత్తులో మరొక రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తనకు ఎటువంటి పదవుల మీద కూడా ఆశ లేదని అన్నారు. తాను చేరిన పార్టీలో ప్రయోజనాలకు ఆశ పడకుండా ఒక కార్యకర్తగానే పని చేస్తానని పేర్కొన్నారు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందనే విషయం తన జీవితంలో జరిగిందని అన్నారు. ఏ స్థాయిలో ఉన్నా సరే నిగర్వి గా ఉంటూ, అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉంటానని చెప్పారు. తను అహంకారంతో మాట్లాడిన మాటలకు నొచ్చుకోకుండా తనకు సినిమా అవకాశాలు ఇస్తూ తనకు అన్నం పెట్టి ఆదరిస్తున్న సినీ ఇండస్ట్రీ పెద్దలకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పృథ్వీరాజు వెల్లడించారు.