తొలి సినిమా పేరు నే ఇంటిపేరు చేసేసుకుని నవ్వులు పూయించిన అల్లరి నరేష్ సీరియస్ నటుడిగా వరుసగా చిత్రాలను ట్రాక్ లో పెట్టాడు ఇటీవల విడుదలైన మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. అయితే ఇంతవరకు హాస్యచిత్రాలతో అలరించిన నరేష్ పూర్తి స్థాయి సీరియస్ సబ్జెక్ట్ లను ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు.? గమ్యం లో గాలి శీను పాత్ర తన సహజ ధోరణి లో సాగుతూనే ఎమోషన్ ని పండిస్తుంది.. అలాగే మహర్షి లో చేసిన క్యారెక్టర్ కూడా అలాగే సాగుతుంది. ఈ రెండు చిత్రాల్లో ఆ పాత్రలు సపోర్టింగ్ గా మాత్రమే నిలబడతాయి.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ పూర్తిస్థాయి కామెడీ బేస్డ్ చిత్రాలు చేస్తూనే అప్పుడప్పుడు ఎర్రమందారం వంటి నటనకు ఎమోషన్ కు ప్రాధాన్యమున్న పాత్రలు ధరించి ఆడియన్స్ ఆదరణ తో పాటు అవార్డు లు కూడా అందుకున్నప్పటికి ఆ విధానాన్ని కొనసాగించలేదు. మళ్ళీ తన బలమైన హాస్యచిత్రాలకే ఓటేశారు. నాంది చిత్రం తో ప్రశంసలు అందుకున్న నరేష్ ఆ జోనర్ బెటర్ అనుకున్నాడో ఏమో సీరియస్ చిత్రాల బాట పెట్టాడు. అగ్రహీరోలు సైతం తమ చిత్రాల్లో కామెడీ చెయ్యడానికి ఇష్టపడుతున్న టైం లో అల్లరి నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది. నాంది వంటి హిట్ ఇచ్చిన దర్శకుడి తో మజిలీ , టాక్ జగదీష్ వంటి చిత్రాలు తీసిన షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ కూడా స్వేచ్ఛ కోరుకుంటున్న బందించబడ్డ చేతులతో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది కూడా నాంది తరహాలోనే వుంటుందన్నట్టు స్పష్టమైంది. ఇది కాకుండా సభకు నమస్కారం అన్న చిత్రం కూడా నరేష్ చేతులో ఉంది. చూడాలి అల్లరోడిని సీరియస్ గా తీసుకుంటారో.. లేదో…